
విశాఖపట్నం, 15 నవంబర్ (హి.స.) విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సు వివిధ దేశాల్లోని పెట్టుబడిదారులను ఆకట్టుకోవడమే కాదు. మన తెలుగు భాష కూడా వారిని ఆకట్టుకుంటోంది. కొంతమంది ఇతర దేశస్తులు సైతం తెలుగు భాష మాధుర్యాన్ని చవిచూస్తూ సంబరపడిపోతున్నారు. తమ నోట నుంచి కొన్ని తెలుగు పలుకులు పలికి పరమానంధభరితులవుతున్నారు. ఇక జపాన్ దేశ రాయబారి ఓనో కిచ్చీ అయితే ఏకంగా తెలుగోలనే ప్రసంగం ప్రారంభించి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేశారు. జపాన్ దేశతో వాణిజ్య సంబంధాలపైన ఆయన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రసంగిస్తూ తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేశారు.
ఈ రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నందుకు ‘‘నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా జపాన్ మరియు భారతదేశం కంపెనీల మధ్య పరస్పర సహకారం అందిపుచ్చుకోవడంపై నేను సంతోషిస్తున్నాను’’ అంటూ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరిచారు. అంతే కాదు తెలుగు భాషపై తనకున్న అభిమానాన్ని ఆయన భావోద్వేగభరితంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా పంచుకున్నారు.
నన్ను ఆహ్వానించినందుకు
కృతజ్ఞతలు అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. తెలుగులో ఇదే తన మొదటి ప్రసంగమని తెలిపారు. జపాన్, ఏపీ మధ్య వాణిజ్య సంబంధాలు ఈ సదస్సు ద్వారా మరింత బలోపేతమవుతాయని చెప్పారు. స్టీల్, ఫార్మా, రిన్యూవబుల్ ఎనర్జీ, శ్రీసిటీ ,టయోమా ప్రీఫెక్చూర్ లాంటి రంగాల్లో వాణిజ్య సహకరం కొనసాగిస్తున్నామని, ఈ సదస్సు ద్వారా జపాన్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ సహకారం మరింత బలోపేతమై మరింతగా కొనసాగుతుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV