
అమరావతి, 14 నవంబర్ (హి.స.) జనసేన పార్టీ(Jana Sena Party)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ(Bolisetty Satyanarayana) భార్య నాగమణి కన్నుమూశారు.
గతకొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘నా జీవితంలో అత్యంత దుఃఖభరితమైన సమయాలలో ఇది ఒకటి. నా జీవితంలో 4 మే 1983న అడుగుపెట్టిన నా ప్రియమైన భార్య నాగమణి, నా ప్రతి సంతోషం-సంక్షోభంలో నాతో నిలిచిన ఆమె, ఈరోజు ఉదయం 3:00 గంటలకు ఈ లోకాన్ని విడిచిపెట్టింది. నా ప్రతి సాధన వెనుక ఉన్న మౌనమైన బలం ఆమె. ఆమెతో కలిసి నా హృదయంలోని ఒక భాగం కూడా వెళ్లిపోయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. ఓం శాంతి’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV