
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)
సిడ్నీలోని హార్న్స్ బై శివారులో జరిగిన
రోడ్డు ప్రమాదంలో ఎనిమిది నెలల గర్భవతి అయిన భారతీయ సంతతికి చెందిన మహిళ మరణించింది. అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం... 33 ఏళ్ల సమన్విత ధరేశ్వర్, తన భర్త మరియు మూడేళ్ల కొడుకుతో కలిసి జార్జ్ స్ట్రీట్ ప్రాంతంలో రోడ్డు దాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు కియా కారును ఢీ కొట్టింది.
కియా కారు రోడ్డు దాటుతున్న సమన్వితను ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై మరణించింది. సమన్విత కడుపులోని బిడ్డ కూడా ప్రమాదం తరవాత మరణించింది. కాగా బీఎండబ్ల్యూ కారును 19 ఏళ్ల మైనర్ నడిపినట్టు పోలీసులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు