
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 20 నవంబర్ (హి.స.)రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil ambani) మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీని దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముమ్మరం చేసింది. తాజాగా రిలయన్స్ గ్రూప్‌నకు సంబంధించిన మరిన్ని ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తాజాగా జత చేసిన ఆస్తుల విలువ రూ.1,400 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈడీ తాజా చర్యలపై రిలయన్స్ గ్రూప్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సిన అనిల్ అంబానీ గైర్హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని ఆయన అభ్యర్థించగా.. ఈడీ అందుకు నిరాకరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ