
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ముంబై,, 20, నవంబర్ (హి.స.)
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలకు తోడు, ఐటీ రంగ సూచీలు ఆకర్షణీయంగా ఉండడంతో మదుపర్లు పాజిటివ్‌గా ఉడండం సూచీలకు కలిసి వస్తోంది. ముఖ్యంగా హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం లభాల్లో కదలాడుతున్నాయి. అయితే బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం నష్టాలను కొనసాగిస్తోంది (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 186)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 300 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ లాభాల జోరును కొనసాగిస్తోంది. ఆరంభంలో కనిపించిన జోష్ కాస్త తగ్గినప్పటికీ సెన్సెక్స్ లాభాల్లోనే ఉంది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 213 పాయింట్ల లాభంతో 85, 399 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 66 పాయింట్ల లాభంతో 26, 119 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో క్యామ్స్, సీడీఎస్‌ఎల్, హిటాచీ ఎనర్జీ, హీరో మోటోకార్ప్, కమిన్స్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). బయోకాన్, వోడాఫోన్ ఐడియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, డెలివరీ, ఎన్‌ఎమ్‌డీసీ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ