
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 20 నవంబర్ (హి.స.): దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు దిగువకు పడిపోతున్నాయి. చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంపై చలిగాలుల ప్రభావం అధికంగా ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలలో చలి, పొగమంచు విపరీతంగా ఉంది.
రాజస్థాన్‌లోని 16 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోగా, మౌంట్ అబూలో బుధవారం ‘సున్నా’ డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాత్రిపూట మంచు విపరీతంగా కురుస్తోంది. ఫతేపూర్, నాగౌర్, సికార్, దౌసా వంటి ప్రాంతాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అస్సాం, మేఘాలయ, బిహార్, తూర్పు యూపీ, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో మోస్తరు నుండి తేలికపాటి పొగమంచు కనిపించింది. వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ