అల్‌ ఫలాహ్‌ నుంచి 10 మంది పరారీ
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
ED Raids Al-Falah University Across 25 Locations in Money Laundering Probe


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 20 నవంబర్ (హి.స.): ఫరీదాబాద్‌ జైషే మహ్మద్‌ ఉగ్ర మాడ్యూల్‌కు స్థావరంగా మారిన అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ, దాని సమీప గ్రామం నుంచి 10 మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడి జరిగినప్పటి నుంచి వీరి ఆచూకీ లభించటం లేదని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. అజ్ఞాతంలోకి వెళ్లినవారిలో వర్సిటీ బోధనా సిబ్బందితోపాటు పలువురు విద్యార్థులు, సమీప గ్రామస్తులు ఉన్నట్లు వెల్లడించాయి. వీలైనంత త్వరగా వీరిని వెతికి పట్టుకోవాలని హరియాణా పోలీసులకు ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్‌ ఆదేశాలు జారీచేశారు. వీరికి ఫరీదాబాద్‌ ఉగ్ర వైద్యుల ముఠాతో సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, భారత్‌లో ఆత్మాహుతి దాడులు జరిపేందుకు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ విరాళాలు సేకరించినట్లు వెల్లడైంది. పాక్‌కు చెందిన ‘సదా’ యాప్‌ ద్వారా ఈ విరాళాలు సేకరించినట్లు గుర్తించారు. మరింత మంది ఆత్మాహుతి బాంబర్లను తయారుచేసేందుకు ఒక్కొక్కరు రూ.20,000 పాకిస్థానీ రూపాయలు ఇవ్వాలని జైషే మహ్మద్‌ సంస్థ పెద్దలు పాక్‌లో పిలుపునిచ్చినట్లు పోలీసుల అదుపులో ఉన్న అల్‌ ఫలాహ్‌ వైద్యురాలు షాహీన్‌ వెల్లడించినట్లు ఎన్‌ఐఏ

.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande