తమిళనాడులో దంచికొడుతున్న భారీ వర్షాలు..
చెన్నై, 20 నవంబర్ (హి.స.) తమిళనాడు రాష్ట్రంలో అనుకోకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం అప్రమత్తత కొనసాగుతోంది. ఇందులో భాగంగా వాతావరణ శాఖ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. అలాగే చెన్నై నగరంలో పాటు మరో ఏడు జిల
వర్షాలు


చెన్నై, 20 నవంబర్ (హి.స.)

తమిళనాడు రాష్ట్రంలో అనుకోకుండా

భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం అప్రమత్తత కొనసాగుతోంది. ఇందులో భాగంగా వాతావరణ శాఖ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. అలాగే చెన్నై నగరంలో పాటు మరో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరునల్వేలి జిల్లాలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. అలాగే వర్షాల తీవ్రత పెరగడంతో తిరునల్వేలిలోని ప్రముఖ జలపాతాల సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. తామిరభరణి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో వరద ముప్పు పెరిగింది. దక్షిణ తమిళనాడులో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో రక్షణ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande