
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 20 నవంబర్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేస్తున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైష్ ఉగ్ర సంస్థ భారత్‌లో మరో ఆత్మాహుతి దాడికి ప్లాన్ రచించిందని తెలుస్తోంది. అంతే కాకుండా ఆ దాడి కోసం డిజిటల్ మార్గాల ద్వారా డొనేషన్స్ సేకరిస్తుందని అందులో సదాపే అనే పాకిస్థాన్‌కు చెందిన యాప్ కూడా ఉన్నట్లు తేలింది. ఫండ్ రుసుం పాక్ కరెన్సీలో 20 వేలు భారత్ (రూ.6400) ఉన్నట్లు సమాచారం. ఈ డబ్బులను ఉగ్రవాదుల ఖర్చుల కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది.
అలాగే, ఉగ్రవాదులకు చలికాలపు కిట్ ముజాహిద్ ఇచ్చే ఎవరైనా జిహాదీలుగా గుర్తిస్తారని వాళ్లు చనిపోయిన తర్వాత వారికి సానుభూతి తెలిపే వారిని సైతం జిహాదీలు గానే పరిగణిస్తున్నట్లు విచారణలో తేలింది. కాగా, ఎర్రకోటలో జరిగిన బాంబు దాడులలో టెర్రర్ డాక్టర్ గ్రూప్‌కు డిజిటల్ మార్గంలోనే డబ్బులు అంది ఉండొచ్చనే దానిపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ