ఫ్యాటీ లివర్ సమస్యలకు చెక్ పెట్టేయండి ఇలా......
ఈ 5 కూరగాయలు తింటే ఫ్యాటీ లివర్‌కు బై బై చెప్పేయొచ్చు!
These 5 Vegetables Naturally Reverse Fatty Liver Fast!


కర్నూలు, 20 నవంబర్ (హి.స.)ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ఈ రోజుల్లో ఒక సైలెంట్ కిల్లర్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా 25% పాపులేషన్‌ను ప్రభావితం చేస్తున్నది. భారత్‌లో 40% ఆడపిల్లలు, 30% అబ్బాయిలు ఈ సమస్య బాధితులు ఉన్నారు. ఊబకాయం, అధిక కొవ్వు ఆహారం, డయాబెటిస్, అల్కహాల్ వాడకం వంటి కారణాల వల్ల లివర్‌లో కొవ్వు పెరుగుతూ, ఇన్ఫ్లమేషన్, సిరాసిస్​కు దారితీస్తుంది.

మందులు, సర్జరీలు ఈ సమస్యను పూర్తిగా తగ్గించలేవు. కానీ మనం తీసుకునే డైలీ డైట్​లో చిన్నచిన్న మార్పులతో, ముఖ్యంగా కొన్ని కూరగాయలు రెగ్యులర్‌గా తింటే, లివర్‌ను క్లీన్ చేసి, కొవ్వును తగ్గించవచ్చు. ఫ్యాటీ లివర్​ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ రీసెర్చ్ ప్రకారం, యాంటీ-ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉన్న కూరగాయలు లివర్ ఎంజైమ్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. ఫ్యాటీ లివర్​ను రాకుండా చేయడంలో దోహదపడే 5 కూరగాయలేంటో తెలుసుకుందాం..

ఈ గ్రీన్ వెజ్ లివర్ డిటాక్స్‌కు చక్కని ఔషధంలా పనిచేస్తుంది. గ్లూకోసినోలేట్స్ అనే యాంటీ-ఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల, లివర్‌లో కొవ్వు ఆక్సిడేషన్‌ను అరికట్టి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. యూనివర్సిటీ ఆఫ కాలిఫోర్నియా స్టడీ ప్రకారం, రెగ్యులర్ గా బ్రోకలి తినడం వల్ల లివర్ ఫ్యాట్‌ను 20% తగ్గిస్తుంది. బ్రోకలిని స్టీమ్ చేసి సలాడ్‌లో జోడించవచ్చు లేదా సూప్‌గా తీసుకోవచ్చు. వారానికి 2-3 సార్లు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

ఐరన్, విటమిన్ A, C ఎక్కువగా ఉండే పాలకూర లివర్ సెల్స్‌ను కాపాడుతుంది. ఫోలేట్, మెగ్నీషియం కొవ్వు బిల్డప్‌ను బ్లాక్ చేస్తాయి. NIH రీసెర్చ్ ప్రకారం, పాలకూర వంటి గ్రీన్స్ ఫ్యాటీ లివర్ రిస్క్‌ను 30% తగ్గిస్తాయి. వారానికి రెండుసార్లు తినడం ఆరోగ్యానికి మంచిది. ఆక్సలేట్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ రిస్క్ ఉన్నవాళ్లు మితంగా తినాలి.

బ్రస్సెల్స్ మొలకలు (Brussels Sprouts)

క్రూసిఫరస్ ఫ్యామిలీకి చెందిన ఈ మొలకలు ఇండోల్స్ కలిగి లివర్ ఎంజైమ్స్‌ను యాక్టివేట్ చేస్తాయి, కొవ్వు అక్యుములేషన్‌ను ప్రివెంట్ చేస్తాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీలో, ఇవి లివర్ ఇన్ఫ్లమేషన్‌ను 25% తగ్గిస్తాయని తేలింది. వారానికి రెండుసార్లు వీటిని రోస్ట్ చేసి లేదా స్టిర్-ఫ్రైలో జోడించి తినడం మంచిది. గ్యాస్ సమస్యలు ఉంటే తక్కువ మొత్తంలో తీసుకోవాలి.

క్యాబేజీలో మెగ్నీషియం, యాంటీ-ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల లివర్ డిటాక్స్‌ను బూస్ట్ చేస్తుంది. ఇది ఫైబర్ రిచ్ కావడం వల్ల డైజెషన్ మెరుగుపడి, కొవ్వు రిడక్షన్ సులభమవుతుంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రకారం, క్యాబేజీ రెగ్యులర్ ఇంటేక్ లివర్ హెల్త్‌ను 15% ఇంప్రూవ్ చేస్తుంది. సలాడ్ లేదా కర్రీలో, రెండు రోజులకు ఒకసారి తీసుకోవాలి. థైరాయిడ్ మెడికేషన్ తీసుకుంటున్నవారు క్యాబేజీని మితంగా తీసుకోవాలి.

క్యారెట్​ బీటా-కరోటీన్, ఫైబర్ కలిగి లివర్‌లో కొవ్వును కరిగిస్తుంది. ఇది డైజెషన్, వెయిట్ లాస్‌కు సహాయపడుతుంది. యూనివర్సిటీ ఆఫ లెడ్స్ స్టడీలో, రోజూ ఒక క్యారెట్ ఫ్యాటీ లివర్ సింప్టమ్స్‌ను 18% తగ్గిస్తుందని తేలింది. క్యారెట్​ని నేరుగా తినవచ్చు లేదా జ్యూస్‌, సలాడ్​లోనూ తీసుకోవచ్చు.

ఈ కూరగాయలు రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చితే, ఫ్యాటీ లివర్‌ను 3-6 నెలల్లో కంట్రోల్ చేయవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నీరు తాగడం, చక్కెర, నూనె వాడకం తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande