నరేంద్ర మోడీ రేపు 21 నుంచి 23 వరకు దక్షిణాఫ్రికా పర్యటన
ఢిల్లీ, 20 నవంబర్ (హి.స.)భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు 21 నుంచి 23 వరకు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నారు. జోహాన్స్‌బర్గ్‌లో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ప్రధాని బయలుదేరనున్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సమ
మోది


ఢిల్లీ, 20 నవంబర్ (హి.స.)భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు 21 నుంచి 23 వరకు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నారు. జోహాన్స్‌బర్గ్‌లో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ప్రధాని బయలుదేరనున్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ సమావేశంలో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి సహకారం, వాతావరణ మార్పు, ఆహారం–ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారతదేశం తాజాగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలు, అంతర్జాతీయ సహకార బలోపేతంపై ప్రధానిగా మోదీ అభిప్రాయాలను ప్రపంచ నేతల ముందుంచనున్నారు. జీ20 సభ్య దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరగనున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande