
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం 'స్పిరిట్' రెగ్యులర్ షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. నేడు ఈ మూవీని పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ చేశారు. ఇక ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్గా వచ్చి క్లాప్ కొట్టడంతో వేడుక ప్రత్యేక అకర్షణగా మారింది. ఈ కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగా, త్రిప్తి డిమ్రితో పాటు నిర్మాతలు భూషన్ కుమార్, శివ చననా, వంగా ప్రణయ్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అలాగే ఈ ప్రాజెక్ట్ ఉన్న వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ పేర్లను మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..