
ముంబై, 24 నవంబర్ (హి.స.)
: ప్రముఖ నటుడు ధర్మేంద్ర ) తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం.. సోమవారం (నవంబరు 24) విషమించడంతో కన్నుమూశారు. అక్టోబరు 31న ధర్మేంద్ర అనారోగ్యం పాలవగా, ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. రొటీన్ చెకప్ కోసమని ఆస్పత్రికి తీసుకెళ్లామని ఆయన కుటుంబం తెలిపారు. ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హేమ మాలిని, సన్నీ దేవోల్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. ఈ క్రమంలో సోమవారం ధర్మేంద్ర ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు. ( సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ