
నారాయణపేట, 24 నవంబర్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహబూబ్నగర్ బిజెపి ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. దమ్ముంటే పాలమూరు జిల్లాలో రోడ్లు బాగు చేయాలని సవాల్ విసిరారు. నారాయణపేటలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలకు దిక్కు లేక కేంద్ర నిధుల కోసం కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే సర్పంచుల పదవీకాలం పూర్తికాగానే ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు