ప్రజలకు సూచన నకిలీ APK ఫైళ్లపై జాగ్రత్త
హైదరాబాద్, 24 నవంబర్ (హి.స.) సోషల్ మీడియా, వాట్సాప్ లాంటి ప్లాట్ఫారమ్లతో పాటు నకిలీ వెబ్సైట్ల ద్వారా మోసగాళ్లు నకిలీ APK ఫైళ్లను పంపుతున్నారు. అవి ''ప్రభుత్వ బెనిఫిట్లు'', ''బ్యాంక్ సేవలు'' లేదా ''పెట్టుబడుల అవకాశాలు'' అని చెప్పి మనల్ని
Cyber Crime


హైదరాబాద్, 24 నవంబర్ (హి.స.)

సోషల్ మీడియా, వాట్సాప్ లాంటి ప్లాట్ఫారమ్లతో పాటు నకిలీ వెబ్సైట్ల ద్వారా మోసగాళ్లు నకిలీ APK ఫైళ్లను పంపుతున్నారు. అవి 'ప్రభుత్వ బెనిఫిట్లు', 'బ్యాంక్ సేవలు' లేదా 'పెట్టుబడుల అవకాశాలు' అని చెప్పి మనల్ని నమ్మింప చేయిస్తారు. అవి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం దొంగిలి ఆర్థిక నష్టం ఎదురవుతుండొచ్చు. అన్నింటినీ జాగ్రత్తగా చూసి తెలియని APKలు డౌన్లోడ్ చేయకండి.

APK మోసాల మోసగాళ్ల పని విధానం:

1. దురుద్దేశపూరిత లింకుల పంపిణీ: నకిలీ లింకులను SMS, WhatsApp, సోషల్ మీడియా లేదా ఈమెయిల్ ద్వారా పంపుతూ ప్రభుత్వ లాభాలు, బ్యాంక్ అప్డేట్లు, ఉద్యోగ అవకాశాలు అని నమ్మిస్తారు such as RTO Challan.APK, PMKisanYojana.apk, ElectricityCurrentBill.APK, HMWSSB.apk, Creditcard.apk, rewardpoints.apk etc.,

2. APK ఫైల్స్ డౌన్లోడ్ చేయమని ప్రోత్సాహించడం: Google Play Store కాకుండా బయట నుంచే APK ఫైల్ను డౌన్లోడ్ చేయమని చెబుతారు.

3. అనవసర అనుమతుల కోరడం: యాప్ ఇన్స్టాల్ చేసే సమయంలో SMS, Contacts, Notifications, Screen Sharing వంటి అనుమతులు కోరుతుంది.

4. లాగిన్ డేటా దొంగిలింపు: యాప్ ద్వారా బ్యాంక్ లాగిన్లు, OTPలు, వ్యక్తిగత సమాచారం వంటి సెన్సిటివ్ డేటా సేకరిస్తారు.

5. దూర నియంత్రణ సాధనాలు (RATs): కొన్ని యాప్లు మొబైల్ను పూర్తిగా నియంత్రించగల టూల్స్ను కలిగి ఉంటాయి, ఇవి మోసపూరిత లావాదేవీలకు ఉపయోగపడతాయి.

6. నమ్మకమైన సంస్థల రూపంలో మోసం: బ్యాంకులు, ప్రభుత్వ పథకాలు లేదా పేమెంట్ గేట్వేలుగా నటిస్తూ నకిలీ యాప్లు రూపుదిద్దుకుంటాయి.

7. ఆర్థిక నష్టం మరియు డేటా దుర్వినియోగం: చివరికి బాధితులు వారి ఖాతాల నుండి డబ్బు కోల్పోవడం లేదా వారి వ్యక్తిగత డేటా మళ్లీ మోసాలకు ఉపయోగపడేలా చేయడం జరుగుతుంది.

APK మోసాలపై ప్రజలకు సూచనలు:

1. తెలియని APK ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దు: SMS, WhatsApp, Telegram, Email, లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన యాప్లను ఇన్స్టాల్ చేయవద్దు

2. అధికారికంగా నిర్ధారించని లింకులు జాగ్రత్తగా చూడండి: బ్యాంక్ అప్డేట్లు, క్యాష్బ్యాక్లు, KYC వెరిఫికేషన్, లేదా ప్రభుత్వ ప్రయోజనాల పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయవద్దు.

3. యాప్ అనుమతులను పరిశీలించండి: అనవసర అనుమతులు అడిగే యాప్లను జాగ్రత్తగా గమనించండి.

4. మొబైల్ మరియు యాంటీవైరస్ అప్డేట్ చేయండి: మాల్వేర్ నుండి రక్షణ పొందేందుకు ఎప్పటికప్పుడు మొబైల్ OS మరియు సెక్యూరిటీ టూల్స్ను అప్డేట్ చేయండి.

5. OTPలు లేదా బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దు: బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలు OTPలు లేదా పాస్వర్డ్స్ అడగవు.

6. జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండండి

o CERT-In, RBI మరియు స్థానిక పోలీస్ సైబర్ విభాగాల సూచనలు పాటించండి.

o సైబర్ మోసాలను 1930 నంబర్కు కాల్ చేసి లేదా cybercrime.gov.in ద్వారా నివేదించండి

o తాజా సైబర్ అవగాహన కోసం మమ్మల్ని అనుసరించండి

o .https://www.facebook.com/cybercrimepshyd

o https://www.instagram.com/cybercrimepshyd

o https://x.com/CyberCrimeshyd/

Sd/- Dy. Commissioner of Police,

Cyber Crimes, Hyderabad city

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande