అర్ధరాత్రి రౌడీ షీటర్ల ఇళ్లకు సజ్జనార్.. స్వయంగా పెట్రోలింగ్ చేసిన సీపీ
హైదరాబాద్, 24 నవంబర్ (హి.స.) మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని రౌడీషీటర్లను హైదరాబాద్ సిటీ సీపీ వి.సి సజ్జనార్ హెచ్చరిచారు. నేర ప్రవృత్తి వీడి సన్మార్గంలోకి రావాలని వారికి హితవు పలికారు. సజ్జనార్ నిన్న ఆదివారం అర్థరాత్రి ఆయన స్
సజ్జనార్


హైదరాబాద్, 24 నవంబర్ (హి.స.)

మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని రౌడీషీటర్లను హైదరాబాద్ సిటీ సీపీ వి.సి సజ్జనార్ హెచ్చరిచారు. నేర ప్రవృత్తి వీడి సన్మార్గంలోకి రావాలని వారికి హితవు పలికారు. సజ్జనార్ నిన్న ఆదివారం అర్థరాత్రి ఆయన స్వయంగా పెట్రోలింగ్ చేశారు. లంగర్ హౌస్, టోలి చౌకి ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేశారు. సైరన్, ఎలాంటి ఆర్బాటం లేకుండా పెట్రోలింగ్ వాహనంలోనే లంగర్ హౌజ్ పీఎస్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీల్లోని రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande