మావోయిస్టు నేత హిడ్మా పోస్టర్లతో ఆందోళన, పెప్పర్ స్ప్రే తో దాడి.. కేసు నమోదు
న్యూఢిల్లీ, 24 నవంబర్ (హి.స.) ఢిల్లీ ఇండియా గేట్ సమీపంలోని సీ హెక్సగన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కాలుష్య సమస్యపై జరిగిన నిరసన ఊహించని విధంగా ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. మదట వాయు కాలుష్యంపై ప్రారంభమైన నిరసనలు ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చ
ఢిల్లీ ఆందోళన


న్యూఢిల్లీ, 24 నవంబర్ (హి.స.)

ఢిల్లీ ఇండియా గేట్ సమీపంలోని సీ

హెక్సగన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కాలుష్య సమస్యపై జరిగిన నిరసన ఊహించని విధంగా ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. మదట వాయు కాలుష్యంపై ప్రారంభమైన నిరసనలు ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ కమాండర్ మడ్వీ హిడ్మా పోస్టర్లు పట్టుకొని రావడం ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు రహదారిని బ్లాక్ చేయడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు తొలగించే ప్రయత్నం చేయగా, నిరసనకారులు పెప్పర్ స్ప్రే స్ప్రేతో పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 22 మంది నిరసనకారులను అరెస్టు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande