రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి
కరీంనగర్, 24 నవంబర్ (హి.స.) విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ ఇందిరా భవన్ లో విశ్రాంత ఉద్యోగస్తుల నూతన కార్యవర్గం జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలి
జీవన్ రెడ్డి


కరీంనగర్, 24 నవంబర్ (హి.స.)

విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ ఇందిరా భవన్ లో విశ్రాంత ఉద్యోగస్తుల నూతన కార్యవర్గం జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నూతన కార్యవర్గానికి శాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యలపై సానుకూలంగా స్పందించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులతో పాటుగా విశ్రాంత ఉద్యోగస్తులు కూడా ప్రధాన పాత్ర పోషించారన్నారు.

ఆనాడు సకలజనుల సమ్మెలో భాగంగా యావత్ తెలంగాణ సమాజం రాజకీయాలకతీతంగా ఉద్యమించడం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని ఉమ్మడి రాష్ట్రంలో మనం ఏమైతే ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande