అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలతో తమిళనాడు అతలాకుతం
తమిళనాడు, 24 నవంబర్ (హి.స.) బంగాళఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వరదలు వస్తున్నాయి. వర్షాలు గంటల తరబడి కురుస్తుండడంతో ముఖ్యంగా తీర ప్
వర్షాలు


తమిళనాడు, 24 నవంబర్ (హి.స.) బంగాళఖాతంలో ఏర్పడిన

ఆల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వరదలు వస్తున్నాయి. వర్షాలు గంటల తరబడి కురుస్తుండడంతో ముఖ్యంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగిపోయాయి. వరదలు పెరుగుతున్నాయి, అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లోపాలు చోటు చేసుకోగా, ప్రజలు ఇళ్లకు పరిమితం అయ్యారు. మరో 48 గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

తాజా పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం రాష్ట్రంలోని 15 జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని IMD హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగాలు హై అలర్ట్లోకి వెళ్లాయి. SDRF బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో మోహరించగా, అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రాకూడదని సూచించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పహారా ఏర్పాటు చేసి, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలను తరలించే చర్యలను ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande