
కర్ణాటక, 24 నవంబర్ (హి.స.)
కర్ణాటక రాష్ట్రంలో సీఎం పదవి
మార్పు పై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తే తాను సీఎంగా కొనసాగుతానని, నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం హైకమాండ్దే నని ఆయన తెలిపారు. తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇద్దరు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నవంబర్ 20తో ప్రభుత్వం అయిదేళ్ల పదవీకాలంలో అర్ధ భాగాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో, 2023లో సిద్ధరామయ్య-శివ కుమార్ మధ్య జరిగిన పవర్ షేరింగ్ ఒప్పందం మళ్లీ చర్చకు రావడంతో, కాంగ్రెస్లో అంతర్గత అధికార పోరు మళ్లీ తెరమీదకి వచ్చింది
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..