
హైదరాబాద్, 24 నవంబర్ (హి.స.)
ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ మేరకు ఈనెల 26న అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ నవీన్ యాదవ్తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, తదితరులు హాజరుకానున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు