
ముంబై, 24 నవంబర్ (హి.స.)
రాజకీయాల్లో ఎప్పుడు సిద్ధాంతాల కంటే సంఖ్యా బలమే ముఖ్యమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రజాస్వామ్యం నడవడానికి రెండు మార్గాలు ఉన్నాయని సిద్ధాం ఒక మార్గం అయితే నంబర్స్ మరొక మార్గం అన్నారు. కానీ సంఖ్యా బలం లేకుండా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లలేరని చెప్పారు. ఉదాహరణకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిహార్ మార్పు కోసం ప్రశాంత్ కిశోర్ ఐడియాలజీ గురించి మాట్లాడారు. కానీ అతని పార్టీకి సీట్లు రాలేదన్నారు. అందువల్ల రాజకీయాల్లో ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండాలని సూచించారు. ఇవాళ ముంబయిలో జరిగిన ఐఐఎంయూఎన్ లో జరిగిన ఇన్వాల్ మెంట్ ఆఫ్ యూత్ ఇన్ గవర్నెన్స్ కన్సర్న్ లో ఫడ్నవీస్ పాల్గొని మాట్లాడుతూ కీలక అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..