
మహబూబాబాద్, 24 నవంబర్ (హి.స.) మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని మయూరి మండల సమాఖ్య కార్యాలయం ఆవరణలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ సోమవారం మహిళలకు చీరల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
మహిళల అభ్యున్నతికి మరియు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అన్ని రంగాలలో మహిళల అభివృద్ధి ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు