
పెద్దపల్లి, 24 నవంబర్ (హి.స.)
మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బంధంపల్లి స్వరూప గార్డెన్స్ లో సోమవారం ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దేశ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు