
న్యూఢిల్లీ, 24 నవంబర్ (హి.స.) బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతికి భారత రాష్ట్రపతి ద్రౌపది మురము సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ధర్మేంద్ర మృతి భారత సినిమాకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన తన దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాత్రలు పోషించారని గుర్తుచేసుకున్నారు.
'అలనాటి నటుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు ధర్మేంద్ర మృతి భారత సినిమా తీరని లోటు. ఆయన తన దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన, మరుపురాని పాత్రలు పోషించారు. భారత సినిమాకు ఆయన మహోన్నతమైన వ్యక్తి. ధర్మేంద్ర కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా' అని రాష్ట్రపతి తన పోస్టులో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు