
న్యూఢిల్లీ, 24 నవంబర్ (హి.స.)
వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025
గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. భారత్ ఆతిథ్య దేశంగా వ్యవహరించిన ఈ పోటీల్లో 18 దేశాల నుంచి 130 మంది బాక్సర్లు పాల్గొని అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రపంచ స్థాయి పోటీలు, బలమైన ప్రత్యర్థుల మధ్య భారత్ రికార్డు స్థాయి పతకాలు సాధించడం ఈ టోర్నమెంట్ను మరింత విశేషంగా నిలిపింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మన అథెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రధాని స్పందిస్తూ.. భారత అథ్లెట్లు వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో చరిత్ర సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 పతకాలు, అందులో 9 స్వర్ణాలు, అనేక రజత-కాంస్యాలు సాధించి ప్రపంచ బాక్సింగ్ వేదికపై భారత ప్రతిభను మరోసారి నిలబెట్టారు.
.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..