మహిళ మృతికి కారణమైన ఆటో డ్రైవర్కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
ఆదిలాబాద్, 24 నవంబర్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఓ మహిళ మృతికి కారణమైన ఆటో డ్రైవర్కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 8500 జరిమానాను అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి సిఎం రాజ్యలక్ష్మి విధించినట్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ఆటో డ్రైవర్ కు శిక్ష


ఆదిలాబాద్, 24 నవంబర్ (హి.స.)

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఓ

మహిళ మృతికి కారణమైన ఆటో డ్రైవర్కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 8500 జరిమానాను అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి సిఎం రాజ్యలక్ష్మి విధించినట్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వివరాల ప్రకారం.. 24 మార్చి, 2021న బోథ్ గ్రామస్తురాలైన బాధితురాలు పవర్ నిర్గుణ ఆటోలో బోథ్కు వస్తున్న క్రమంలో మద్యం సేవించి ఉన్న ఆటో డ్రైవర్ షేక్ జావిద్ పాషా నిర్లక్ష్యంగా ఆటోని నడుపుతూ టివిటి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టగా

అందులో ప్రయాణిస్తున్న బాధితురాలు నిర్గుణ తీవ్ర గాయాలపాలై అధిక రక్తస్రావంతో ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందింది. ఈ కేసు నందు నేరం రుజువు కావడంతో వాదనలు విన్న అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి సీఎం. రాజ్యలక్ష్మి ముద్దాయి అయిన ఆటో డ్రైవర్కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ 8500/- జరిమానాను విధించినట్లు ఎస్పీ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande