
ఖమ్మం, 24 నవంబర్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రైతులకు న్యాయం జరుగుతుందని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. సోమవారం ఏన్కూరు మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటు పడుతుందన్నారు. సన్నరకం ధాన్యం క్వింటాలు ధర 2389 రూపాయలకు, దొడ్డు రకం ధాన్యం క్వింటాలు 2369 రూపాయలకు కొనుగోలు చేస్తారని ఆయన అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు