మహిళల ప్రగతి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
నిర్మల్, 24 నవంబర్ (హి.స.) రాష్ట్రంలో మహిళల ప్రగతి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఉట్నూర్ ని ఐకేపీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు


నిర్మల్, 24 నవంబర్ (హి.స.) రాష్ట్రంలో మహిళల ప్రగతి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఉట్నూర్ ని ఐకేపీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రగతి కోసమే మహిళలను ఉన్నత స్థాయిలో ఉంచడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుందని ఇందులో భాగంగానే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande