
షాద్నగర్, 24 నవంబర్ (హి.స.) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థకు అత్యధికంగా నిధులను కేటాయిస్తూ విద్యకు పెద్దపీట వేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫరఖ్ నగర్ లో సోమవారం పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. హెచ్ఎండీఏ నిధుల నుంచి మంజూరైన రూ.40 లక్షలతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం, మరమ్మత్తులను చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థకు పెద్దఎత్తున నిధులను కేటాయిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులను కనిపిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు