
వికారాబాద్, 24 నవంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొడంగల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా కొడంగల్ మండలం నుంచి మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలు, వెటర్నరీ కళాశాల వంటి విద్యా సంస్థలను దుద్యాల మండలానికి తరలించడాన్ని నిరసిస్తూ కొడంగల్ డెవలప్మెంట్ కమిటీ (KDC) జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో పలు వ్యాపార సంఘాలు సంపూర్ణ బంద్ పాటిస్తున్నాయి. సీఎం రేవంత్ కొడంగల్ ప్రాంత అభివృద్ధికి చేసిన వాగ్దానాలను ఉల్లంఘించారని, స్థానికుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆందోళనకారులు నిరసనకు దిగారు. నేటి స్వచ్చంద బంద్కు వ్యాపార సంఘాలు, వాణిజ్య సంస్థలు పూర్తి మద్దతు ఇస్తున్నాయి. కొడంగల్ ప్రాంతానికి మంజూరైన అన్ని విద్యా సంస్థలను కొడంగల్లోనే నెలకొల్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు