నార్సింగిలో డ్రగ్స్ కలకలం.. 4.5 గ్రాముల హెరాయిన్ స్వాధీనం
హైదరాబాద్, 24 నవంబర్ (హి.స.) నార్సింగిలో పోలీసులు సోమవారం డ్రగ్స్ పట్టుకున్నారు. 4.5 గ్రాముల హెరాయిన్ ను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మై హోమ్ అవతార్ లేబర్ క్యాంప్ వద్ద హెరా
డ్రగ్స్


హైదరాబాద్, 24 నవంబర్ (హి.స.)

నార్సింగిలో పోలీసులు సోమవారం డ్రగ్స్ పట్టుకున్నారు. 4.5 గ్రాముల హెరాయిన్ ను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మై హోమ్ అవతార్ లేబర్ క్యాంప్ వద్ద హెరాయిన్ విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వెస్ట్ బెంగాల్ నుండి హైదరాబాద్ కు హెరాయిన్ స్మగ్లింగ్ చేసి విక్రయిస్తుండగా 4.5 గ్రాముల సరుకు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన దాల్మియా, లక్కన్ బర్మాలను అరెస్ట్ చేశారు. నిందితుల పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande