
హైదరాబాద్, 24 నవంబర్ (హి.స.)
గత కొద్దిరోజులుగా స్థబ్దుగా ఉన్న
డ్రగ్స్ ముఠాలు నూతన సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్నతరుణంలో మరోసారి డ్రగ్స్ సరఫరాకు దిగుతున్నాయి. తాజాగా నగరవ్యాప్తంగా పలుచోట్ల డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్ ను తీసుకువస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. వారి వద్ద నుండి 15 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్న ఈ ముఠా న్యూ ఇయర్ ను టార్గెట్ గా పెట్టుకుని డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..