సామాన్యుల సొంతింటి కలను నెరవేరుస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం.. చేవెళ్ల ఎమ్మెల్యే
రంగారెడ్డి, 24 నవంబర్ (హి.స.) గ్రామాల్లో ఏళ్లుగా సొంతింటిని కట్టుకోవాలనే కలను సామాన్య ప్రజలకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం మండలంలోని ఏక్ మామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ఇందిరా మహిళా
చేవెళ్ల ఎమ్మెల్యే


రంగారెడ్డి, 24 నవంబర్ (హి.స.)

గ్రామాల్లో ఏళ్లుగా సొంతింటిని కట్టుకోవాలనే కలను సామాన్య ప్రజలకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం మండలంలోని ఏక్ మామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో కృషి చేస్తోందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది నిరాశ్రయ కుటుంబాలకు సురక్షిత గృహాలు లభిస్తున్నాయని చెప్పారు. మహిళలను యజమానులను చేయడం కోసం కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి.. ఇంకా అవుతున్నాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande