
సిద్దిపేట, 24 నవంబర్ (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీకి సర్వర్ అడ్డంకిగా మారింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామీణా ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. అయితే ఐకేపీ వీవోఏల మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్న సెర్ఫ్ ప్రొఫైల్ యాప్ సక్రమంగా పనిచేయడం లేదు. అందరూ ఒకేసారి యాప్ను వినియోగించడం కారణంగా సర్వర్ మొరాయిస్తోంది. మహిళల ఫొటోలను దించి యాప్లో నమోదు చేసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో మహిళకు పది, పదిహేను నిమిషాల సమయం పడుతుండడంతో గ్రామాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ఆలస్యమవుతోంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు