
వనపర్తి, 24 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ విద్యా అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను అందుబాటులోకి తీసుకొస్తుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. అక్టోబర్ రెండో తేదీన సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులకు, సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్లను నిర్మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలకు సమాన విద్య అందిస్తుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు