16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఆస్ట్రేలియా బాటలో మరో దేశం
హైదరాబాద్, 24 నవంబర్ (హి.స.) 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ దేశ చట్టసభల్లో ఇటీవల ఓ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు వచ్చే నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. అయితే సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా బాటల
సోషల్ మీడియా


హైదరాబాద్, 24 నవంబర్ (హి.స.)

16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ దేశ చట్టసభల్లో ఇటీవల ఓ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు వచ్చే నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. అయితే సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా బాటలోనే మరో దేశం పయనించాలని భావిస్తోంది. మలేషియా (Malaysia) సైతం అండర్ 16 పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని (Social Media Ban) అమలు చేసే ప్లాన్ చేస్తున్నదని, సామాజిక మాధ్యమాలపై పరిమితులు విధించడంలో ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలు ఎలా వ్యవహరిస్తున్నాయో తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని మలేషియా కమ్యూనికేషన్ మంత్రి ఫాహ్మి ఫడ్జిల్ తెలిపినట్లు స్థానిక మీడియా కథనం వెలువరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande