స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా
హైదరాబాద్, 24 నవంబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ అంశం రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పి
హైకోర్టు


హైదరాబాద్, 24 నవంబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ అంశం రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈ విచారణ జరుపుతోంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం ఆధారంగా రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఎన్నికలపై డిసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అనూహ్యంగా హైకోర్టులో ఇవాల్టి విచారణ వాయిదా పడింది. దీంతో రేపు హైకోర్టు విచారణ జరిపితే ఎలాంటి నిర్ణయం వెలువరించబోతోంది? కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉందనే సస్పెన్స్ కంటిన్యూ అవబోతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande