మరో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్, 24 నవంబర్ (హి.స.) ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్లోని టెహ్రీ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేంద్ర నగర్ ప్రాంతంలోని కుంజాపురి–హింద
ఉత్తరాఖండ్ ప్రమాదం


ఉత్తరాఖండ్, 24 నవంబర్ (హి.స.)

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు

లోయలో పడిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్లోని టెహ్రీ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేంద్ర నగర్ ప్రాంతంలోని కుంజాపురి–హిందోళాఖల్ మార్గంలో సుమారు 28 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు SDRF అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారంతో వెంటనే రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande