
వేములవాడ, 24 నవంబర్ (హి.స.) సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.స్వామివారికి ప్రీతి పాత్రమైన సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ ఎల్.రమాదేవి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే భక్తులను కలుస్తూ.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులకు సూచనలు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు