ఆఫ్ఘనిస్థాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇండియ‌న్స్ కు ఇక‌పై ఫ్రీగానే!
కాబూల్, 24 నవంబర్ (హి.స.)ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మధ్య సత్సంబంధాలు చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో మన ఇండియా పాత్ర చాలా కీలకం. సుమారు 3 బిలియన్ డాలర్లకు పైగా ఆఫ్గనిస్తాన్ కు ఇండియా సహాయం చేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఆఫ
ఆఫ్ఘనిస్థాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇండియ‌న్స్ కు ఇక‌పై ఫ్రీగానే!


కాబూల్, 24 నవంబర్ (హి.స.)ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మధ్య సత్సంబంధాలు చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో మన ఇండియా పాత్ర చాలా కీలకం. సుమారు 3 బిలియన్ డాలర్లకు పైగా ఆఫ్గనిస్తాన్ కు ఇండియా సహాయం చేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనం, ఇతర రహదారులు, కీలక ప్రాజెక్టులను నిర్మించడంలో ఇండియాదే కీల‌క పాత్ర‌. ముఖ్యంగా పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ కు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చింది ఇండియా. ఈ కారణాల నేపథ్యంలో అక్కడ తాలిబన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, మన భారతీయులకు చాలా గౌరవం ఇస్తారు.

తాజాగా ఆఫ్గనిస్తాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఇండియాకు సంబంధించిన కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని, వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటన చేసింది. కంపెనీలు పెట్టుకునేందుకు ఉచితంగా భూములు కూడా ఇస్తామని వెల్లడించింది. ఆ భూముల్లో కంపెనీలు పెట్టి, తమ ఆర్థిక వృద్ధికి సహాయం చేయాలని ఇండియాను కోరుతోందట ఆఫ్ఘనిస్తాన్.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande