డిసెంబర్ 15 నుంచి అరటి సీజన్ మొదలు
కడప, 25 నవంబర్ (హి.స.).. ఇప్పుడు పండ్లతోటల ఖిల్లా.. అరటి, సపోటా, మామిడి, జామ, డ్రాగన్‌ ఫ్రూట్‌, బత్తాయి ఇలా పలు హార్టికల్చర్‌ పండ్లతోటలకు హబ్‌గా మారు తోంది. అయితే మార్కెట్‌ ధరలకు అనుగుణంగా కటింగ్‌ చేయకపోవడం, ముందస్తు పంట కారణంగా పంటచేతికి వచ్చినప్ప
డిసెంబర్ 15 నుంచి అరటి సీజన్ మొదలు


కడప, 25 నవంబర్ (హి.స.).. ఇప్పుడు పండ్లతోటల ఖిల్లా.. అరటి, సపోటా, మామిడి, జామ, డ్రాగన్‌ ఫ్రూట్‌, బత్తాయి ఇలా పలు హార్టికల్చర్‌ పండ్లతోటలకు హబ్‌గా మారు తోంది. అయితే మార్కెట్‌ ధరలకు అనుగుణంగా కటింగ్‌ చేయకపోవడం, ముందస్తు పంట కారణంగా పంటచేతికి వచ్చినప్పుడు ధరలో వ్యత్యాసం ఉంటోంది. ప్రస్తుతం జిల్లాలో అరటి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అరటి సీజన్‌ డిసెంబరు 15 నుంచి మొదలవుతుంది. మన దగ్గర పండే పంట అంతా ఎక్కువ శాతం నార్త్‌ అంటే ఢిల్లీ, పంజాబ్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. డిసెంబరు వచ్చిందంటే చాలు నార్త్‌ కు చెందిన పలు కంపెనీలకు చెందిన వ్యాపారులు కడప, పులివెందుల, మైదుకూరు, కాశినాయన మరికొన్ని చోట్ల వాలిపోయి అరటి పండ్లు కొనుగోలు చేసేందుకు ఎగబడు తుంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande