
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)
గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రపంచకప్
బాక్సింగ్ కప్ ఫైనల్స్లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. కంప్లీట్ ఫుల్ ఫామ్లో జరీన్ గురువారం మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ 5-0తో గవో యీ గ్జువాన్ (చైనీస్ తైపీ)ని చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె ఇవాళ క్రీడా శాఖ మంత్రి వాటికి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నిఖత్ జరీన్ ను మంత్రి శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడాకారులకు అన్ని రకాలుగా భరోసా కల్పిస్తూ.. ఎలాంటి సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమని మంత్రి శ్రీహరి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు