
ముంబై, 26 నవంబర్ (హి.స.)బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. పది గ్రాముల బంగారం ధరపై ఏకంగా 870 రూపాయలు ఎగబాకింది. దేశంలోని ఫ్యూచర్స్ మార్కెట్ నుండి న్యూయార్క్ COMEX మార్కెట్ వరకు బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. భారతదేశ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండవ రోజు పెరిగాయి. డేటా ప్రకారం.. రెండు రోజుల్లో బంగారం ధరలు రూ.2,000 కంటే ఎక్కువ పెరిగాయి. ఇంతలో వెండి ధర రూ.1.58 లక్షలను అధిగమించింది. బంగారం, వెండి రెండూ వాటి గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక ఉన్న అంచనాలు నిజమైతే కొత్త రికార్డును సృష్టించవచ్చు.
ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,910 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,250 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. దీనిపై కూడా భారగా పెరిగింది. ఏకంగా 2000 రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుతం వెండి కిలోకు రూ.1,69,000.
హైదరాబాద్:
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,27,910
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,250
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV