
మంబై, 25 నవంబర్ (హి.స.)గోల్డ్ లవర్స్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే.. గత రెండు, మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పసిడి పరుగులు కాస్త తగ్గించినట్టుగా కనిపిస్తుంది. ఏడాది ఆరంభం నుండి ప్రజల్ని బెంబేలెత్తిస్తూ పరిగెత్తిన పసిడి ఇప్పుడు మెల్లిగా దిగివస్తున్నట్టుగా కనిపిస్తుంది. గత మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది. నవంబర్ 24 సోమవారం 24క్యారెట్ల బంగారం 10గ్రాములు రూ. 1,25,130 ఉండగా, అది స్వల్పంగా తగ్గింది. ఈ రోజుకు 1,25,120కి తగ్గింది. దేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం…
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,25,660 పలుకుతోంది. అదే 22 క్యారెట్ల ధర రూ.1,15,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,70,900 లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,25,120, 22 క్యారెట్ల ధర రూ.1,14690 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,62,900 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,25,270, 22 క్యారెట్ల ధర రూ.1,14,840 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,62,900 లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV