
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్
మెస్సి(Lionel Messi).. ఇండియాలో టూర్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ లెజెండరీ ప్లేయర్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా అడుగుపెట్టనున్నాడు. తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ విషయాన్ని చెప్పాడు. మరికొన్ని వారాల్లో గోట్ టూర్ ప్రారంభంకానున్నదని, భారత్ ప్రదర్శిస్తున్న ప్రేమ పట్ల థ్యాంక్స్ చెబుతున్నట్లు పేర్కొన్నారు. తన విజిట్లో హైదరాబాద్ నగరాన్ని కూడా జోడించారని, ఇది సంతోషకరమైన విషయం అన్నారు. అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి ఇండియాలోని కోల్కతా, ముంబై, ఢిల్లీ నగరాలతో పాటు హైదరాబాద్లోనూ టూర్ చేయనున్నారు.
డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్ నగరానికి మెస్సీ వస్తున్నాడు. ఆ రోజు రాత్రి 7.30కు కార్యక్రమం జరగనున్నది. మెస్సీ రాకను స్వాగతిస్తూ ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఫుట్బాల్ ప్రేమికులకు, హైదరాబాద్ నగరానికి ఇది సంతోషకరమైన విషయం అన్నారు. మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు నగరం సిద్ధంగా ఉందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..