రేపటినుండి భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిపైనే అందరి దృష్టి
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆడనున్నారు. శుభ్మన్ గిల్ మెడ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో జట్టుకు
క్రికెట్


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆడనున్నారు. శుభ్మన్ గిల్ మెడ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించబోతున్నాడు. మరోవైపు, లాంగ్ గ్యాప్ తర్వాత టెంబా బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టుకు వన్డే మ్యాచ్లు ఆడబోతోంది. భారత జట్టు దాదాపు 25 సంవత్సరాల అనంతరం సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో ఇటీవల టెస్టు సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. కోల్కతా టెస్టులో 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన టీమ్ ఇండియా, గువహటి టెస్టులో ఏకంగా 408 పరుగుల అంతరంతో పరాజయం పాలైంది. దీంతో వన్డే సిరీస్లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్లేయర్లు చూస్తున్నారు. ముఖ్యంగా జట్టులో దిగ్గజాలైన రోహిత్, విరాట్ ఉండటం చాలా ప్లస్ అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande