
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.)
హారర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న
ఇండియా లేటెస్ట్ మూవీ 'ది రాజాసాబ్'. పాన్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో డిసెంబర్కు వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ది రాజాసాబ్కు సంబంధించిన వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షను పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే గత కొద్ది కాలంగా మా సినిమాపై తప్పుడు వార్తలు సృష్టించి వైరల్ చేస్తున్నారు. మరోసారి వాయిదా పడిందంటూ.. ప్రచారం చేస్తున్నారు. జనవరి 9న అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఐమాక్స్ వెర్షన్తో సహా అన్ని ఫార్మెట్లలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్లో అమెరికాలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపబోతున్నాం. డిసెంబర్ 25లోపు అన్ని పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీని సిద్ధం చేసే ప్లాన్ చేస్తున్నాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు