
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.)
బుల్లితెరపై తన ప్రత్యేకమైన క్రేజ్తో
కొన్ని సంవత్సరాలుగా దూసుకుపోతున్న యాంకర్ సుమ తన వాక్చాతుర్యం, కామెడీ పంచ్లతో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. యాంకర్గా మాత్రమే కాదు, వీలైనపుడు వెండితెరపై నటిస్తూ కూడా అభిమానులను అలరిస్తుంది. ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన సుమ, 2022లో విడుదలైన జయమ్మ పంచాయతీ లో టైటిల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా బాక్ఆఫీస్ వద్ద పెద్ద హిట్ సాధించలేకపోయినా, ఆమె పాత్రకు, యాక్టింగ్కు మంచి మార్కులు లభించాయి.
తాజాగా సుమ మరోసారి వెండితెరపై నటించడానికి సిద్ధమైంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న సినిమా “ప్రేమంటే”. ఇందులో కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. థ్రిల్లింగ్ రొమాంటిక్ డ్రామా శైలి ఉన్న ఈ చిత్రంలో సుమ కీలక పాత్ర పోషిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు