
ముంబై, 6 నవంబర్ (హి.స.)పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి భారీగా పతనమవుతున్నాయి. వెండి రేటు రూ.3500 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గడం దేశీయంగా ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 6వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎంతెంత ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం అనేది అలంకరణ వస్తువే కాదు పెట్టుబడి సాధనంగానూ పని చేస్తుంది. మహిళలతో పాటు పురుషులూ బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. అలాగే ఇటీవలి కాలంలో వివిధ రూపాల్లో బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. నేరుగా భౌతిక బంగారం కొనడంతో పాటు డిజిటల్ రూపంలో బంగారం కొంటున్నారు. అయితే, ఈ ఏడాది 2025లో బంగారం ధరలు ఏకంగా 60 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయ అనిశ్చితి, దేశాల మధ్య యుద్ధాలు, అమెరికా సుంకాలు, ఫెడ్ వడ్డీ రేట్లు, డాలర్ విలువ వంటివి పసిడి ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి. అయితే, దీపావళి వరకు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. వరుసగా తగ్గుతూ ఊరట కల్పిస్తున్నాయి. ఇప్పుడు వరుసగా రెండో రోజూ భారీగా తగ్గాయి. ఈ క్రమంలో వియవాడ మరియు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నవంబర్ 6వ తేదీన తులం బంగారం రేటు ఎంత పలుకుతుందో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధర క్రితం రోజు 60 డాలర్లకు పైగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ మళ్లీ పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 23 డాలర్లకు పైగా పెరిగి 3974 డాలర్ల స్థాయికి చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.18 శాతం మేర పెరిగి 48.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులానికి క్రితం రోజు రూ. 710 మేర తగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో రూ.980 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ. 1,21,480 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై క్రితం రోజూ రూ.650 తగ్గగా ఈరోజు రూ.900 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,11,350 వద్దకు దిగివచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV